Welcome to Rishi Pharma

Rishi Ayurved

Home

About

Products

Patient Info

Ayurved Books

TELUGU  తెలుగు

 

 

 

 

ఋషివాక్యం

ఏకైకా గౌ, స్త్రయ స్సింహాః,
పంచవ్యాఘ్రాః ప్రసూతిభిః
అధర్మో నష్టసంతానో
ధర్మః సంతానవర్ధనః

గోవు సాధువు. ఎవరి జోలికి పోదు. అంతేకాదు, అందరి ప్రాణాలు నిల్పుతుంది. అట్టి ఆవు ఈనేది ఒక్క దూడనే. క్రూరజంతువులైన సింహాలు మూడేసి పిల్లలనూ, బెబ్బులులు ఐదేసి పిల్లలనూ పెడుతున్నా క్రూరజంతుజాతి నశిస్తున్నది, గోజాతి వృద్ధిపొందుతున్నది. ఎందుకంటే ధర్మం తీరే అంత! ధర్మపరుల సంతానం వృద్ధిలోకి వస్తుంది, అధర్మపరుల సంతతి నశిస్తుంది.

ఇంటింటా ఆయుర్వేదం

కొన్ని సామాన్య అనారోగ్యాలకు ఇంట్లోనే తయారు చేసికోగల మందుల్ని, తయారీ విధానాన్ని ఈ దిగువ యిస్తున్నాం. మీ ఇంటిల్లపాదినీ ఆరోగ్యంగా ఉంచుకోండి!

మలబద్ధం
మలవిసర్జన వేళపట్టున కాకపోవడం దీని ప్రధాన లక్షణం. విరేచనం గట్టిగా అవడం, గట్టిగా  ముక్కితేనే కాని అవకపోవడం, 2-3 రోజులకొకసారి అవడం జరుగుతాయి. మలం కడుపులో ఉండిపోవడంతో అపానవాయువు (గ్యాస్‌) దుర్వాసనతో వెలువడటం, తేన్పులు, ఆకలి మందగింపు ఉంటాయి. కడుపులోని అసౌకర్యంతో చికాకుగా ఉండి ఏపనీ సరిగా చేయలేరు. దేనిపైనా మనసు నిలవదు. మొహం కూడా అప్రసన్నంగా ఉంటుంది. అసహనం ఉంటుంది. మలబద్ధం కారణంగా మొలలు (పైల్స్‌) కూడా ఏర్పడవచ్చు.
కారణాలు:
భోజనం తగినంత తినాలి. భోజనంలో డయటరీ ఫైబర్‌ (పీచు పదార్థం) అధికంగా ఉండాలి. రోజుకి 8-12 గ్లాసుల నీళ్ళు తాగాలి. అన్నాన్ని నమిలి తినాలి. జంక్‌ఫూడ్‌ (అడ్డమైన చిరుతిళ్ళు) తినకూడదు. ఇవేవీ పాటించకపోవడమే మలబద్ధానికి ప్రధాన కారణం. ఇవి కాక కొన్ని రకాల అల్లోపతి మందులు మలబద్ధం కలిగిస్తాయి. స్థూలంగా ఇవీ కారణాలు:
నివారణ:
పైన చెప్పిన జాగ్రత్తలు పాటించండి. రోజూ రాత్రి అన్నం తిన్నాక వేడిచారు 1 గ్లాసుడు త్రాగండి.

ఆయుర్వేద గృహ చికిత్స: కరక్కాయ, తానిక్కాయ, ఉసిరికాయ ఈ 3 రకాల (పచ్చి) కాయల్ని నీడన ఆరబెట్టి, అటుపైన పిక్కతీసి ఎండబెట్టుకోవాలి. పిక్కతీయకుండా ఈ కాయలు పూర్తిగా ఎండవు. ఎండేక వీటిని మెత్తగా గుండ చేసుకొని సమపాళ్ళలో కలుపుకోవాలి. కాయలు ఎండేటప్పుడు బూజు పట్టకూడదు సుమా! ఇలా కలుపుకున్న పౌడరునే త్రిఫల చూర్ణం అంటారు. ఈ చూర్ణాన్ని ఒక చెంచాడు ఉదయం, ఒక చెంచాడు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే మలబద్ధం కంట్రోలయిపోతుంది. దాంతో పాటే అనుసరించి వచ్చే మిగతా లక్షణాలు/బాధలు కూడా పోతాయి.

02. రేల చెట్టు (Cassia fistula) లేతఆకుల్ని పచ్చడి దంచుకొని దాన్ని భోజనంతో 2,3 ముద్దలు కలుపుకొని తినండి. మోషన్‌ ఫ్రీగా అవుతుంది. మలబద్ధం పోతుంది.

దగ్గు

చలికాలం వచ్చింది. తరచు ఎవరో ఒకరికి దగ్గు వస్తూంటుంది. కండరాలన్నీ బిగబట్టి దగ్గడానికి అవస్థ పడుతూంటే మీకూ అయ్యో అనిపిస్తూంటుంది కదూ...!

ఈసారి అలా అనుకొని ఊరుకోకండి. పిప్పళి మొక్క వేళ్ళు (Piper longum ) వేళ్ళు, పాతబెల్లం సమపాళ్ళలో తీసుకొని మెత్తగా నూరండి. (నీళ్ళు చల్లకండి). వీటిని 1 గ్రా. మోతాదులో మాత్రలు చేసుకొని ఉ., సా. ఒకొక్క మాత్ర వేయండి. 3-5 రోజులు వెయ్యాలి. మంచి నీళ్ళతో యివ్వండి. మందు వాడుతున్నప్పుడు వంకాయ, కొబ్బరి, గోంగూర, కోడిమాంసం తినవద్దని చెపుతారు. పై మందును జీలకర్ర రసంతో తీసుకుంటే జీర్ణక్రియ చాలా బాగా జరుగుతుంది. నిద్రలేమి తొలగిపోతుంది.

       (సౌజన్యం: ఆదివాసి సంప్రదాయ మూలికావైద్యుల సంక్షేమ సం.)

సంతోషంగా జీవించాలంటే ...? కోరికలు గుర్రాల్లా ఎల్లప్పుడూ దౌడుకే సిద్ధంగా ఉంటాయి. అవి పుట్టాలే కాని పుట్టేక, వాటి వెనుక మనం పరుగెత్తి సాధించేలా చేసుకుంటాయి అవి...

   

 


Problem conceiving?

Married but never had intercourse?

What position and frequency of intercourse is optimal for conception?

Does women on top position diminish pregnancy chances?

I am on pills to regularize my periods. Pills delay pregnancy. But I want to conceive. How can I ensure both?

Consult care@rishiayurved.in for  many such questions.

Register here for free.
 

 

REGISTER!



 

 

Customer care
Billing policy
Refund and Return Policy
About Us


Product Categories:

Joint Care
Male Fertility supplements
Female Fertility supplements
Sexual Wellness supplements
Digestion supplements
 

 

Subscribe to our Newsletter

* required
 

Rights Reserved. Rishi Pharma, Samalkot, India. 2014.

 

Google+